జాతీయ సైబర్ భద్రత చైతన్య మాసం (ఎన్ సిఎస్ఎఎమ్)-2021


 

హైదరాబాద్అక్టోబర్ 11, 2021

ప్రస్తుతం మనం ఒక సైబర్ కాలంలో జీవిస్తున్నాం.  ఈ కాలం లో మన కార్యకలాపాలు అన్నిటిలోను డిజిటల్ సాంకేతికతలు సాయం చేస్తున్నాయి.  ప్రత్యేకించి కోవిడ్ నేపథ్యం లోప్రతి ఒక్క రంగం డిజిటల్ మాధ్యమం పై ఆధారపడిపోవడాన్ని మనం గమనిస్తున్నాం.  పరిస్థితి ఎలా ఉందంటే సైబర్ సెక్యూరిటీ కీలకమైందే కాక సైబర్ క్రిమినల్స్మోసగాళ్ళుహ్యాకర్స్ బారి నుంచి డేటా నునెట్ వర్క్ లనుసిస్టమ్స్ నువ్యక్తిగత గోప్యత ను  కాపాడుకోవాలంటే అందుకు సైబర్ సెక్యూరిటీ ఎంతో అవసరమైంది గా మారిపోయింది.

 

సమాజం లో ప్రతి ఒక్క వర్గాని కి చెందినసమాజం లోని ప్రతి ఒక్క రంగానికి చెందిన  డిజటల్ యూజర్ లు సైబర్ దాడులు చాలా వరకు  ఏయే రకాలు గా జరుగుతూ ఉంటాయనేది  తెలుసుకోవడం ముఖ్యం.  అలాగేవారిని వారు కాపాడుకోవడానికి భద్రమైన ఆన్ లైన్ అభ్యాసాల గురించి న అవగాహన ను కూడా ఏర్పరచుకోవలసి ఉంది.  అంతేకాదునేషనల్ సెక్యూరిటీ  కౌన్సిల్ సెక్రటేరియట్ (ఎన్ఎస్ సిఎస్) సిఫారసు చేసిన మేరకు దేశం లో సైబర్ సంబంధిత దృఢత్వాన్ని కూడా పెంచుకోవలసి ఉంది.  సైబర్ సెక్యూరిటీ విషయం లో జాగృతి ని వ్యాప్తి చేయాలనే ధ్యేయంతో ప్రపంచ వ్యాప్తం గా అక్టోబర్ నెల ను జాతీయ సైబర్ భద్రత చైతన్య మాసం (ఎన్ సిఎస్ఎఎమ్) గా పాటించడం జరుగుతోంది.

 

దీనికి అనుగుణంగానేసిఇఆర్ టి - ఐఎన్ఎన్ఐసి మరియు సి-డిఎసి లతో ఎలక్ట్రానిక్స్ ఎండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎమ్ఇఐటివై) కలసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ ఎండ్ అవేర్ నెస్ (ఐఎస్ఇఎ) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  ఈ కార్యక్రమం లో భాగం గా వివిధ పద్ధతులలో ఒక విశిష్టమైన సాముదాయక జాగృతి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది.  మన దేశం లో డిజిటల్ యుగం పౌరుల ను సైబర్ ప్రపంచం పట్ల అవగాహన కలిగి ఉండే విధంగానుసురక్షత కు నోచుకొన్న నెటిజన్ లు గాను తీర్చిదిద్దాలి అనేది ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం గా ఉంది.

 

ఈ జాతీయ సైబర్ భద్రత చైతన్య మాసం లో తలపెట్టిన కార్యక్రమాల లో దేశం అంతటి నుంచి వేరు వేరు ప్రాంతాలకు చెందిన ప్రజలు పాలుపంచుకొనిసైబర్ జగతి లో పొంచి ఉండే అపాయాలు మరియు వేరు వేరు రకాల సైబర్ త్రెట్స్ బారి నుంచి తమను తాము విజయవంతంగా కాపాడుకొనేందుకు అవసరమైన సమాచారాన్నిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని వారికి సూచించడం జరుగుతోంది.

 

జాతీయ సైబర్ భద్రత చైతన్య మాసం’ (ఎన్ సిఎస్ఎఎమ్) ను జరిపే క్రమంలో ఈ క్రింద తెలిపిన చైతన్య కార్యకలాపాలను ఐఎస్ఇఎ నిర్వహిస్తోంది.. :

·        టిప్స్: అత్యుత్తమ భద్రత చర్యలపై ఒక విశిష్టమైన సైబర్ భద్రత ఆలోచనను ప్రతి రోజు ఒకటి వంతున అందజేయడం.

·        రోజువారీ వీడియో:  సైబర్ భద్రత కు సంబంధించిన ఒక అంశాన్ని ప్రజలకు వివరించడం కోసం రూపొందించిన వీడియోల ను రోజుకు ఒకటి చొప్పున విడుదల చేయడం.

·        సాధారణ వీడియో: వినియోగదారులు సురక్షితంగా ఉండటంలో వారికి సాయపడేలా సైబర్ భద్రత చర్యలను వివరిస్తూ సాగే ఓ సాధారణ వీడియో ను విడుదల చేయడం.

·        కాన్ సెప్ట్ స్: బహుళ ప్రచారంలో ఉన్న సైబర్ భద్రత కాన్ సెప్ట్ లను గురించి వివరించడం.

·        సర్వేక్షణ/క్విజ్:  ఒక వ్యక్తి సైబర్ భద్రత అంశంలో ఎంత వరకు ‘సైబర్ ఫిట్ నెస్ క్వోషంట్’ ను కలిగి ఉన్నదీ తెలుసుకోవడం కోసం ఒక క్విజ్ ను నిర్వహించడం;  దీనిలో పాల్గొనే వారందరికీ ఇ-సర్టిఫికెట్స్ ను ఇవ్వడం.

·        క్రాస్ వర్డ్:  ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ భద్రత సమాచారంపై రూపొందించిన గళ్ళ నుడికట్టు ను పరిష్కరించడం ద్వారా సైబర్ భద్రత సవాళ్ళుసైబర్ భద్రత సంబంధిత బెదరింపుల పట్ల ఒక వ్యక్తి ఎంత అవగాహనను కలిగివున్నారనేది పరీక్షించడం జరుగుతుంది.  దీనిలో విజేతలుగా నిలచే వారు సర్టిఫికెట్లు గెల్చుకోవచ్చు.

·        సమాచార పత్రం:  దీనిలో భాగంగా సైబర్ భద్రతకు సంబంధించిన ఒక అంశం పై పూర్తి సమాచారాన్ని ఒక్కచోటులోనే (న్యూజ్ లెటర్ రూపంలో) అందించడం జరుగుతుంది.  

·        టూల్:  సైబర్ భద్రత కు సంబంధించిన ఉపయోగకర టూల్స్ గురించి వివరించడం.

·        మాల్ వేర్ అలర్టులు:  వివిధ రకాలైన మాల్ వేర్ దాడుల విషయం లో అప్రమత్తం గా ఉండండంటూ అలర్ట్ స్ సందేశాన్ని పంపించడం.

·        కిడ్:   సైబర్ భద్రత అంశాలను బోధిస్తూ ఒక కార్టూన్ కథ ను ప్రత్యేకంగా బాలల కు  అందించడం.

·        చిన్న పుస్తకం:  మన రోజువారీ సైబర్ జీవనంలో మనకు మేలు చేసేటటువంటి చిన్న చిన్న పుస్తకాలను తీసుకురావడం.

·        నకిలీ వార్తలు:  సామాజిక మాధ్యమ వేదికలలో ఎన్నెన్ని నకిలీ సందేశాలు పోగు పడుతున్నదీ ఎలా గుర్తించవచ్చో వివరించే ఒక అలర్ట్ మెసేజ్ లేదా ఒక పోస్టర్ ను గురించి ఈ ఫేక్ న్యూజ్ లో చెబుతారు.

·        వర్క్ షాపులు

 

చైతన్యాన్ని వ్యాప్తి చేయడం:

 

సోషల్ మీడియా ద్వారా అవగాహన:

సాధారణ ప్రజల చెంతకు ప్రభావవంతమైన విధంగా చేరుకోవడానికి ఐఎస్ఇఎ సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకోవడం జరుగుతోంది.  దీనికి తోడుపైన ప్రస్తావించిన కార్యకలాపాలన్నిటినీ సోషల్ మీడియా లో వెల్లడించిఅన్ని మంత్రిత్వ శాఖలుసామాజిక మాధ్యమ నిర్వహణదారు సంస్థలు (సోషల్ మీడియా హ్యాండిల్స్)రాష్ట్రాల ఐటి కార్యదర్శి హ్యాండిల్స్రాష్ట్రాల పోలీస్ విభాగం హ్యాండిల్స్విద్యా మండలులుసమాజంలో ప్రముఖ వ్యక్తులున్యూస్ చానళ్ళు/ మీడియా చానళ్ళను ట్యాగ్ చేస్తూ ఆయా అంశాలను మరింత మంది దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా కోరడం జరుగుతుంది. వీలైనంత ఎక్కువ మంది ఈ అంశాలను గురించి తెలుసుకొనేటట్లు చేసిఈ అంశాలకు బహుళ ప్రజాదరణ లభించేటట్లు చూడటం దీనిలోని ముఖ్యోద్దేశ్యం. 

పైన చెప్పిన కార్యకలాపాలన్నిటినీ ఉదయం పూట 8.00 గంటలు మొదలుకొని రాత్రి పూట 8.00 గంటల వరకుగంటకు ఒకసారి చొప్పునఅన్ని సామాజిక మాధ్యమ వేదికల లో నమోదు చేయడం జరుగుతోంది.

 

ఈ కింద ఇచ్చిన లింకులను అనుసరించగలరు:

 

ఫేస్ బుక్ : https://www.facebook.com/infosecawarenesss/

 

ట్విటర్https://twitter.com/InfoSecAwa

యూట్యూబ్https://www.youtube.com/c/InformationSecurityAwareness

 

ఇన్ స్టాగ్రామ్https://www.instagram.com/infosec_awareness/

 

టెలిగ్రామ్https://t.me/ISEAAwareness

 

వెబ్ సైట్ ద్వారా జాగృతి:

మొత్తం సమాచారాన్ని సామాన్య ప్రజలకు అందుబాటు లోకి తీసుకు పోవడానికిగాను ఎన్ సిఎస్ఎఎమ్-2020 పేరిట www.infosecawareness.in వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది.

వర్క్ షాప్ లు/వెబినార్ ల ద్వారా జాగృతి:

ప్రభుత్వ యూజర్లుసాధారణ యూజర్లుప్రభుత్వప్రైవేటు సంస్థలు.. ఈ వర్గాల కోసం దేశవ్యాప్తంగా పోటీలను నిర్వహించాలని ఐఎస్ఇఎ తలపెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగాల విభాగాలురాష్ట్రాల పోలీసువిద్యఐటి విభాగాల సహాయాన్ని తీసుకోవడం జరుగుతుంది.  

భాగస్వామి సంస్థలు:

ఎన్ సిఎస్ఎఎమ్- 2021 ని అత్యుత్తమ పద్ధతి లో ప్రజాబాహుళ్యం లోకి తీసుకుపోవడానికిగాను విద్య మంత్రిత్వ శాఖ (ఎమ్ఒఇ) హోం మంత్రిత్వ శాఖ (ఎమ్ హెచ్ ఎ)ఇండియా టీచర్ ఎడ్యుకేశన్ కమ్యూనిటి (ఐటిఇసి)సైబర్ గర్ల్ప్రభుత్వ రంగ బ్యాంకులుఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి నవరత్న కంపెనీలు వగైరా భాగస్వామి సంస్థలతో ఐఎస్ఇఎ చేతులు కలిపింది.  ఈ సంస్థలు వాటి వినియోగదారులలోస్టేక్ హోల్డర్ లలో సైబర్ జగత్తుకు సంబంధించిన స్పృహ ను విస్తరింప చేసేందుకు తోడ్పడనున్నాయి.

ఈ ఈవెంట్ లలో పాల్గొనడానికిమరింత ఎక్కువ సమాచారాన్ని పొందడానికి ఈ కింద ఇచ్చిన వాటిని సందర్శించగలరు:

 

వెబ్ సైట్ : www.infosecawareness.in

 

ఫేస్ బుక్ : https://www.facebook.com/infosecawareness/

 

ట్విటర్https://twitter.com/InfoSecAwa

 

యూట్యూబ్https://www.youtube.com/c/InformationSecurityAwareness

 

ఇన్ స్టాగ్రామ్https://www.instagram.com/infosec_awareness/

 

టెలిగ్రామ్ : https://t.me/ISEAAwareness

Popular posts from this blog

*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*

కీలక అంశాలపై ఐజేయూకార్యవర్గం- సుదీర్ఘ చర్చ