పకడ్బందీగా  ధాన్యం కొనుగోలు ప్రక్రియ -  కలెక్టర్

 


 



నల్గొండ, నవంబర్ 12:-- ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్ తెలిపారు.


సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి లు ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివరిస్తూ వర్షాలు సమృద్ధిగా పడినందున  జిల్లాలో గతం కంటే అదనంగా వరి సాగు జరిగిందని తెలిపారు. తద్వారా గతంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నందున అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన గన్నీ బ్యాగులను రవాణా సౌకర్యాల ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం సేకరణ,మద్దతు ధర సమస్యల పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ,సన్న బియ్యం మద్దతు ధర,తేమ,నాణ్యత పై పిర్యాదులు పై పౌర సరఫరాలు,వ్యవసాయ,పోలీస్, తూనికలు,కొలతలు శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం గవించినట్లు,సరిహద్దు రాష్ట్రాలనుండి జిల్లాకు ధాన్యం రాకుండా జిల్లా సరిహద్దులలో  చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని ఎట్టి పరిస్థితుల్లో ఇతర ధాన్యం జిల్లాకు రాకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు


అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు అధిక ధర చెల్లిస్తున్న అక్కడినుండి  అక్రమంగా రాష్ట్రంలోని పరిసర జిల్లాలకు వచ్చే అవకాశం ఉన్నందున దాన్ని అరికట్టడానికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు జిల్లాస్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి గట్టి పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామాలు రైతులు సాగు  విస్తీర్ణం వివరాలు సిద్ధం చేసుకోవాలన్నారు. సుమారు 12 వేల కోట్ల రూపాయలు ధాన్యం సేకరణకు కేటాయించామని తెలిపారు.  అందువల్ల ఇతర రాష్ట్రాల నుండి  వచ్చిన ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర బడ్జెట్ పై ప్రభావం పడుతుందన్నారు. పోలీస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకొనిఈ దిశగా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.


మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థాయి సంబంధిత అధికారులతో ప్రతి  కొనుగోలు కేంద్రానికి ఒక కొనుగోలు కమిటీ ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కమిటీ ధృవీకరిస్తేనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో పర్యవేక్షక కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీ సభ్యులు లు జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను పర్యటించి వేరే రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా తనిఖీలు చేయాలని తెలిపారు. తూకాల్లో అదనంగా వసూలు చేయకుండా తరుగు పేరుతో రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్.పి. ఏ.వి.రంగ నాథ్,అదనపు ఎస్.పి.నర్మద, డి సి ఎస్ ఓ రుక్మిణీ , civil supplies డిస్ట్రిక్ట్ మేనేజర్ నాగేశ్వర్ రావు, మార్కెటింగ్ ఏ. డి. ఆలీం, తదితరులు పాల్గొన్నారు.


Popular posts from this blog

*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*

కీలక అంశాలపై ఐజేయూకార్యవర్గం- సుదీర్ఘ చర్చ