పల్లె ప్రగతి 2 వ విడత  కార్యక్రమం


కలెక్టరేట్లోని  ఉదయాదిత్య భవనంలో పల్లె ప్రగతి 2 వ విడత  కార్యక్రమం అధికారులతో జిల్లా స్థాయిఅవగాహన సదస్సు నిర్వహించారు. పల్లె ప్రగతి రెండవ విడత కార్యక్రమం జనవరి  రెండు నుండి నిర్వహించనున్నట్లు,మొదటి విడత నిర్వహించిన విధంగా నే రెండవ విడత పల్లె ప్రగతి జిల్లా,మండల,గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో పని చేసి విజయ వంతంగా నిర్వహించాలని ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ కోరారు.శని వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన సమావేశంలో మండల పర్యవేక్షణ అధికారులు,మండల పంచాయతీ అధికారులు,అర్.డి.ఓ.లు, తహశీల్దార్ లు,ఎం.పి.డి.ఓ.లు,వ్యవసాయ శాఖ అధికారులు,ట్రాన్స్ కో,పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు,జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ ఏ.పి.ఓ.లు, ఏ.పి.యం.లు, అటవీ శాఖ,మండల విద్యా శాఖ,గ్రామీణ నీటి సరఫరా శాఖ,మెడికల్ ఆఫీసర్ లతో రెండవ విడత పల్లె ప్రగతి జిల్లా స్థాయి సన్నాహక  సమావేశం నిర్వహించి పల్లె ప్రగతిలో చేపట్ట వలసిన పనుల పై అవగాహన కలిగించారు.  ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి,  మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవలసి వున్నదని, ఎన్నికల విధులనుండి ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు.మొదటి దశ పల్లె ప్రగతిలో పూర్తి కానీ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు  గ్రామ పంచాయతీ మొత్తం పరిశుభ్రoగా వుంచెలా పారిశుధ్యం  ప్రాముఖ్యత నివ్వాలని అన్నారు . గ్రామాల్లో శిథిలమైన ప్రభుత్వ ప్రైవేట్ భవనాలను తొలగించాల ని, డ్రైనేజీలు పరిశుభ్రం చేయాల ని, కంప చెట్లు ముళ్ల పొదలు తొలగించాలను అన్నారు. ప్రతి కుటుంబానికి 2 చెత్త బుట్టలు అందజేయాలనీ, ఇందుకోసం దాతల సహాయం తీసుకోవాల ని, గ్రామానికి సంబంధించిన  పూర్వ విద్యార్థులను ,దాతల ను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి  గ్రామం యొక్క అవసరాలను  మరియు ప్రభుత్వ పాఠశాలలను యొక్క అవసరాలను గూర్చి వివరించి వారి తోడ్పాటు అందించే విధంగా ప్రోత్సహించా ల నీ సూచించారు.  వీలైనంత వరకు శ్రమదానం తో గ్రామస్తులందరిని భాగస్వాములను చేసేందుకు ప్రయత్నించాలనీ, అన్ని గ్రామ పంచాయితిలలో 2 వ పల్లె ప్రగతి ప్రోగ్రాంకి సంబంధించిన బ్యానర్లను ఏర్పాటు చేయా లని,అదేవిధంగా ప్రతి గ్రామంకు నర్సరీ ,డంప్ యార్డ్ ,వైకుంఠ ధామం ఉండాలని అన్నారు.  జనవరి 2 వ తేదీ  రాష్ట్ర స్థాయి ఐ ఏ ఎస్ ,ఐ పి ఎస్ ,ఐ ఎఫ్ ఎస్ అధికారులతో కూడిన ప్లయింగ్ స్క్వాడ్ ల బృందాలు తనిఖీ కి వస్తున్నందున మొదటి పల్లె ప్రగతి ప్రోగ్రాంలో చేసిన పనుల వివరాలు రిజిస్టర్లు ఫోటో ఆల్బమ్లు  అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు .మంచి ప్రతిభ కనబర్చిన ప్రజాప్రతినిధులు ,అధికారులకు జనవరి 26 న ఉత్తమ పంచాయితీ అవార్డుతో ప్రతి మండలానికి 3 గ్రామ పంచాయతీలకు అవార్డు ఇవ్వ బడునని తెలిపారు అదేవిధంగా దాతలకు సన్మానం చేయబడునని తెలిపారు  


 ఈ సమావేశంలో జడ్పీ సి ఇ ఓ వీరబ్రహ్మ చారి , డి ఆర్ డి ఓ. శేఖర్ రెడ్డి , డి పి ఓ. విష్ణు వర్ధన్ ఇతర అధికారులు పాల్గొన్నారు


Popular posts from this blog

*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*

కీలక అంశాలపై ఐజేయూకార్యవర్గం- సుదీర్ఘ చర్చ