ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు-జడ్.పి.చైర్మన్

 



 


 


 


నల్గొండ, అక్టోబర్ 16.రైతాంగం మేలు కోరి వారు పండించిన వరి ధాన్యం ను మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జడ్.పి.చైర్మన్ బండ నరేందర్  రెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉదయాదిత్య భవన్ లో 2019-20 సంవత్సరానికి ఖరీఫ్ లో వరి ధాన్యం సేకరణ పై జిల్లా స్థాయి లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో అర్.డి.ఓ.లు, తహశీల్దార్ లు,మండల పర్యవేక్షణ అధికారులు,డి.ఎస్.పి.లు,జిల్లా గ్రామీణాభివద్ధి,సహకార శాఖ ప్రాథమిక వ్యవసాయ సహకార  కేంద్రాల కార్యదర్శులు,మార్కెటింగ్,వ్యవసాయ శాఖ అధికారులు,పౌర సరఫరాల శాఖ అధికారులు,ఎం.పి.పి.లు,జడ్.పి.టి.సి.లు,కార్మిక శాఖ అధికారులు,రైస్ మిల్లర్లు,లారీ కాంట్రాక్టర్ లు ఈ సదస్సులో పాల్గొని గత ఖరీఫ్ సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురైన సమస్యలు ముఖ్యంగా టార్పా లిన్ లు సమకుర్చుట,తూకం వేయడంలో తేడాలు,తేమ శాతం సరి చూడడం,హమాలిల సమస్యలు,ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మిల్లు కు రవాణా చేసేందుకు ఎదురైన ఇబ్బందులు ,సలహాలు,సూచనలు చేస్తూ ఈ సీజన్ లో సాపిగా వరి ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసేందుకు విజయ వంతంగా నిర్వహణకు కృషి చేస్తామని తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తేమ కొలవడం లో తేడా లేకుండా మిల్ పాయింట్ వద్ద,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒకే రకమైన ఏ కరీతి తేమ కొలిచే యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.తూకం కొలిచే కాంటాలను మార్కెటింగ్ శాఖ నుండి కొనుగోలు కేంద్రాల కు పంపిణీ చేయకముందే తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీ చేసి సర్టిఫై చేయాలని ఆదేశించారు.గతంలో కొను గొలు కేంద్రాలలో నిర్ణయించిన విధంగానే 41 కె.జి.లు అమలు చేయాలని సూచించారు.హమాలీ ల కు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా జిల్లా మొత్తం ఒకే విధమైన రేట్ నిర్ణయించి అమలు చేయాలని,ఒక వేళ ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే జిల్లా స్థాయి అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని, అన్నారు.జిల్లాలో మండల స్థాయిలో అన్ని శాఖల అధికారుల తో సమావేశాలు నిర్వహించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్చించి అన్ని ఏర్పాట్లు చేయాలని,రైతు సమన్వయ సమితి అధ్యక్షులను కూడా భాగస్వామ్యులను చేయాలని తెలిపారు.ధాన్యం కొనగోలు అనంతరం అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పని చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని అన్నారు.
ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ గత ఖరిప్ 2018_19 సంవత్సరం లో 2,23,000     
మెట్రిక్ టన్నుల వరి ధాన్యం  102  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి
రైతులకు  394 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగిందని అన్నారు.ప్రస్తుత ఖరీఫ్ 2019సంవత్సరం లో వర్షాలు బాగా కురిసి నాగార్జున సాగర్,ఇతర కాలువలు నిండి ధాన్యం దిగుబడి రెట్టింపు  పెరిగిందని అన్నారు.జిల్లాలో 66,346 హెక్టార్ లలో సాగు చేసిన 4,58,580 మెట్రిక్ టన్నుల ధాన్యం
ధాన్యం
జిల్లాలో 96 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల కు
రానున్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఐ. కె.పి.ద్వారా 55  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు,        ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా41  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధత తో వుందని,రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేసి డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 24,78,553           గన్ని బ్యాగులు అందు బాటులో వున్నాయని తెలిపారు.మండల స్థాయిలో వచ్చే వారం రోజుల్లో తహశీల్దార్లు,మండల పర్యవేక్షణ అధికారులు,వ్యవసాయ శాఖ అధికారులు అన్ని శాఖల అధికారులతో  సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, అనాంతరం అర్ .డి.ఓ.లు,డి.ఎస్.పి.లు మండల స్థాయిలో చర్చించిన అంశాలు సమీక్షించి డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు.ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నీ నియమించి నట్లు,రవాణా పరంగా లారీ లను ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్ లు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద వసతులు కల్పించినట్లు,టెంట్,త్రాగు నీరు,బ్యాన్నర్ సరిపడా టార్పా లిన్ లు ,తూకం,తేమ యంత్రాలు అందు బాటులో వుంటాయని తెలిపారు.వరి ధాన్యం కు క్వింటాల్ కు "ఏ" గ్రేడ్ కు1835, సాధారణ రకానికి రూ.లు 1815/- మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని అన్నారు.
జడ్.పి. వైస్ చైర్మన్ పెద్దులు మాట్లాడుతూ గత ఖరీఫ్ లో కొన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల నుండి నిర్ణీత తూకం కంటే ఎక్కువగా ధాన్యం తూకం వేసి రైతుల నుండి తీసుకున్నారని,ఈ సారి అటువంటి అవకాశం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా పౌరసరఫరాల శాఖ డి.యం.నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కు జిల్లాలో చేపట్టిన చర్యలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ధాన్యం కొనుగోలు కు సంబంధించి రవాణా,ఇతర సమస్యలు పై జిల్లా కలెక్టర్ కార్యాలయం లో,పౌర సరఫరాల డి.యం.కార్యాలయం లో కంట్రోల్ రూం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ సమావేశం లో జిల్లా గ్రామీణా భివృద్ది అధికారి శేఖర్ రెడ్డి,జిల్లా సహాకార అధికారి అర్.శ్రీనివాస మూర్తి,మార్కెటింగ్ ఏ.డి. ఆలీం,జిల్లా పౌర సరఫరాల అధికారి రుక్మిణీ,సహాయ పౌర సరఫరా ల అధికారి నిత్యా నందం,వ్యవసాయ శాఖ జె.డి.సుజాత తదితరులు పాల్గొన్నారు.


Popular posts from this blog

*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*

కీలక అంశాలపై ఐజేయూకార్యవర్గం- సుదీర్ఘ చర్చ